రివ్యూ : 'అమ్మోరు తల్లి'
నటీనటులు: నయనతార, ఆర్.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్ తదితరులు
మ్యూజిక్: గిరీష్ గోపాలకృష్ణన్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్.బి
నిర్మాత: ఐసరి కె.గణేష్
దర్శకత్వం: ఆర్.జె.బాలాజీ, ఎన్.జె.శరవణన్
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుని లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను దక్కించుకున్న నయనతార దీపావళి సందర్బంగా ముక్కుత్తి అమ్మన్ సినిమాతో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా అమ్మోరు తల్లిగా డబ్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
ఆర్జే బాలాజీ ఒక జర్నలిస్ట్. పేరులేని టీవీ ఛానల్ లో పనిచేస్తుంటాడు. ఎలాగైనా ఓ సెన్సషనల్ స్కూప్ చేసి పెద్ద ఛానల్ కు జర్నలిస్ట్ గా వెళ్లాలని తెగ తాపత్రయ పడుతుంటాడు. కానీ, ఎన్ని చేసినా పెద్దగా వర్కౌట్ కాదు. మరోవైపు వయసు పెరిపోతుంది ఎలాగైనా పెళ్లి చేయాలనీ అనుకున్న అతని తల్లి పడరాని పాట్లు పడుతుంది. ఎన్నో సంబంధాలు చూస్తుంది. వాటన్నింటిని బాలాజీ ఎదో రూపేణా చెడగొడుతూ ఉంటాడు. తిరుపతి వెళ్లి మొక్కు చెల్లించుకోవాలని చూస్తారు. కానీ కుదరదు. అదే సమయంలో గ్రామం చుట్టుపక్కల ఉన్న 11 వేల ఎకరాలను బాబా అభయ్ ఘోష్ దేవుడి పేరు చెప్పి కబ్జా చేస్తాడు. ఈ కుంభకోణం గురించి తెలుసుకున్న బాలాజీ దానిని ఛేదించాలని చూస్తాడు. కానీ, బాలాజీ మాటలు ఎవరు నమ్మరు. బాలాజీ తల్లి ఇంటిదైవం మూకుత్తి అమ్మాన్ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మి గుడికి వెళ్లారు. అక్కడ అమ్మోరు తల్లి బాలాజీకి కనిపిస్తుంది. తాను మూకుత్తి అమ్మాన్ అంటే నమ్మడు. ఆమె లీలల తరువాత నమ్ముతాడు. దొంగబాబా ఆక్రమించుకున్న పంచావనాన్ని రక్షించుకోవడానికి వచ్చినట్టు అమ్మోరు తల్లి చెప్తుంది. ఆ తరువాత ఏమైంది అన్నది మిగతా కథ. విశ్లేషణ : దేవుళ్ళు, దేవతలు భూమి మీదకు రావడం, ఇక్కడి సమస్యలు తీర్చడం, మనుషులతో కలిసి ప్రయాణం చేయడం వంటి సోసియో ఫాంటసీ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అమ్మోరు తల్లి సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. కాకపోతే, ఇది పూర్తిగా ఫన్ మూవీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడ్డం పెట్టుకొని సమస్యలను అమ్మోరు తల్లి చేత పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. అయితే, నయనతార కంటే ఎక్కువ సీన్స్ ఆర్జే బాలాజీ తన కోసం రాసుకున్నారు. ఆరంభం నుంచి సినిమా ఫన్ గా నడిచినా, మధ్యలో ట్రాక్ తప్పడంతో కొంత విసుగు తెప్పిస్తుంది. ఇక అమ్మోరు తల్లి వచ్చిన తరువాత కథ కొద్దిగా మెయిన్ ట్రాక్ పై నడుస్తుంది. అయితే, ఫాంటసీ సినిమాకు ఉండాల్సిన ట్విస్ట్ లు సినిమాలో లేకపోవడంతో ట్రాక్ తప్పింది.
నటీనటుల పనితీరు :
ప్రముఖ తమిళ నటుడు ఆర్ జే బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆర్ జే బాలాజీతో పాటు ఎన్ జే శరవనన్ కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నయనతార ముక్కు పుడక అమ్మవారిగా కనిపించారు. అమ్మవారు అంటే సినిమా మొత్తం నయనతార త్రిషూలం కిరీటం పెట్టుకుని కనిపించకుండా ఒక నిండైన మహిళ పాత్రలో నయన్ కనిపించింది. అమ్మవారిగా నయన్ నూటికి నూరు పాళ్లు బాగా సెట్ అయ్యింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవతగా ఆమె వ్యంగ్య మాటలు మరియు హావభావాలు కూడా శృతి మించకుండా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. హీరో ఆర్జే బాలాజీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అయినప్పటికీ ఫన్ క్రియేట్ చేసి కొంత మెప్పించారు. అయితే, అతని పాత్రలో కాస్తంత ఓవర్ కనిపించింది.
చివరిగా : 'అమ్మోరు తల్లి' అనుగ్రహించింది
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)