ఈ హీరో కోసం ఒక అమ్మాయి బట్టలు సర్దుకొని వచ్చేసిందట

ఈ హీరో కోసం ఒక అమ్మాయి బట్టలు సర్దుకొని వచ్చేసిందట

అందాలరాక్షసి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చెచుకున్నాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తర్వాత నవీన్ చంద్రకు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయిందట. అతడి మోసం ఇల్లు వదిలిపెట్టి వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారట. అందాల రాక్షసి రిలీజైన తొలి రోజు తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయిట. అందులో అమ్మాయిల కాల్స్ ఎక్కువ. ఫోన్ చేసి ఐలవ్ యు అని చెప్పి విసిగిస్తే చివరికి స్విచ్ఛాఫ్ చేసానని తెలిపాడు నవీన్. చాలామంది నా అడ్రెస్ తెలుసుకొని నాకు గిఫ్టులు కూడా పంపారు అని అంటున్నాడు. అంతే కాకుండా ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇల్లు వదిలిపెట్టి హైదరాబాద్ కూడా వచ్చేసిందట. సికిందరాబాద్ లో ఓ హోటల్ లో ఉన్నానని రమ్మని  తెగ కాల్స్ చేసి విసిగించిందట. అందాల రాక్షసి సినిమా తరవాత హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసాడు కానీ అవి హిట్ అవ్వలేదు. ఆతర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన  "అరవింద సమేత" సినిమాలో నవీన్ నెగిటివి షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు.ఈ సినిమాలో నవీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక  "ఆర్ఎక్స్ 100" సినిమాలో ముందుగా నవీన్ నటించాల్సి ఉందట. అజయ్ భూపతితో కలిసి నిర్మాత కోసం ట్రై చేసి వదిలేశాడు. చివరికి ఆ సినిమాని కార్తికేయ చేశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.ప్రస్తుతం నవీన్ కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియాలో నటించాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది.