నవీన్ చంద్ర నూతన చిత్రం ప్రారంభం

నవీన్ చంద్ర నూతన చిత్రం ప్రారంభం

 

నవీన్ చంద్ర హీరోగా మంచి ఆదరణ పొందారు. టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రస్తుతం సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తన తాజా చిత్రం చేస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను అరవింద్ దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభ వేడుకలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు మూవీ స్క్రిప్ట్‌ను అందచేశారు. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవీన్ స్టోరీ లైన్ వినగానే నాకు చాలా నచ్చి వెంటనే సినిమా ఓకే చెప్పేశానని అన్నారు. ‘‘అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో మధుబాలగారి వంటి వారితో నటించడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంద’ని నవీన్ అన్నారు. ఈ సినిమాను గొప్ప థ్రిల్లర్‌ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్‌గారు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాలగారు ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుండి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది’’ అని అన్నారు.