డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో కీలక పురోగతి

డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో కీలక పురోగతి

విజయవాడ మహిళా డాక్టర్ సూసైడ్ మిస్టరీగా మారింది. భవానీపురంలో నివసిస్తున్న దేవీ ప్రియాంక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 31 రాత్రి ఆమె సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని కాటూరు మెడికల్ కళాశాలలో పలమనాలజీలో ఎండీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.. తన చావుకు నవీన్ కారణమని సూసైడ్ లెటర్ ను రాసి పెట్టడడంతో అతనెవరో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో పురోగతి సాధించారు. ప్రియాంక సూసైడ్ కారణమైన డాక్టర్ నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నవీన్ వల్లే చనిపోతున్నా అంటూ సూసైడ్ లెటర్ రాసింది ప్రియాంక. నెల రోజులుగా పరారీలో ఉన్న డాక్టర్ నవీన్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, నెల్లూరు , కర్నూలు వెళ్లిన పోలీసులు బృందాలు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.