సరిగ్గా 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు... ప్రపంచానికి షాక్...!!

సరిగ్గా 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు... ప్రపంచానికి షాక్...!!

మొదటి స్వతంత్ర యుద్ధం తరువాత పశ్చిమ దేశాల ఆధిపత్యం ఎక్కువైంది.  అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది.  ఇదే బాటలో ఇండియాకు ఎదగడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది.  కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన అణుశక్తిని, అణుబాంబును ఇండియా సొంతం చేసుకుంది.  ఇందిరాగాంధీ సమయంలో అణుపరీక్షలు నిర్వహించిన ఇండియా ఆ తరువాత దాని జోలికి వెళ్ళలేదు.  అయితే, 1998 మే 11 వ తేదీన ప్రధాని వాజ్ పాయి నేతృత్వంలో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో మరోమారు అణుపరీక్షలను రాజస్థాన్ లోని ఫోక్రాన్ ఏరియాలో నిర్వహించింది.  

ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే పసిగట్టే అమెరికా కళ్లుగప్పి అణుపరీక్షలు నిర్వహించడం అంటే మాములు విషయం కాదు.  కానీ, దీనిని ఇండియా చేసి చూపించింది.  మిస్సైల్ శక్తి పేరిట ఈ మిషన్ ను ప్రారంభించిన దీనిని సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచింది. అణుపరీక్షలు నిర్వహించిన తరువాతగాని అమెరికాకు ఈ విషయం తెలియలేదు.  దీంతో అమెరికా అంత ఎత్తున ఎగిరిపడింది.  ఇండియాపై ఆంక్షలు విధించింది.  ఇదంతా ఒకెత్తయితే, సాంకేతిక రంగంలో ఇండియా పశ్చమ దేశాలతో దీటుగా ఎదుగుతున్న తరుణంలో, ఫోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించిన మే 11 వ తేదీని నేషనల్ టెక్నాలజీ డే గా ప్రకటించింది.  మార్స్ మీదకు సైతం ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో పంపుతున్న ఇండియా త్వరలోనే సొంతంగా అంతరిక్షంలోకి మనిషిని పంపబోతున్నది.  దీని ఆరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే ఓ స్పేస్ మిషన్ ను ఏర్పాటు చేయబోతున్నది ఇండియా.