ఈ నెల 25 నుండి విల్లు ఎక్కుపెట్టనున్న భారత ఆర్చర్లు...

ఈ నెల 25 నుండి విల్లు ఎక్కుపెట్టనున్న భారత ఆర్చర్లు...

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అన్ని క్రీడలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ అని క్రీడలు, అలాగే శిక్షణ శిబిరాలు ప్రారంభమవుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ వచ్చే నెలలో ప్రారంభం కానుండటంతో మన క్రికెట్ మొదలైనట్టే. అలాగే వాయిదా పడిన ఒలంపిక్స్ కోసం హాకీ  జాతీయ జట్టుకు శిక్షణ శిబిరం బెంగళూరులో కొన్ని రోజుల కింద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కానీ అందులో శిక్షణ పొందుతున్న ఆరుగురు క్రీడాకారులకు కరోనా సోకింది. అయితే ఈ నెల 25 నుండి భారత ఆర్చర్లకు కూడా ఎస్‌ఐఐ పుణేలో శిక్షణ శిబిరం ప్రారంభించనుంది. ఇందులో కేవలం 16 మంది ఆర్చర్లు మాత్రమే పాల్గొననున్నారు. అందులో 8 మంది పురుషులు (తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, బి.ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్, జయంత తలుక్దార్, సుఖ్‌మను బాబ్రేకర్, కపిల్, విశ్వాస్), మరో 8 మంది మహిళలు ( దీపిక కుమారి, అంకిత భగత్, బొంబేలా దేవి, రిధీ, మధు వేద్వాన్, హిమని, ప్రమీలా బరియా, తిషా సంచెటి). అయితే వీరందరికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించి అందులో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిని క్వారెంటైన్ లో ఉంచి చికిత్స అందించనున్నారు.