మొతేరా పిచ్ పై ఆసీస్ స్పిన్నర్ షాకింగ్ కామెంట్స్...

మొతేరా పిచ్ పై ఆసీస్ స్పిన్నర్ షాకింగ్ కామెంట్స్...

అహ్మదాబాద్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన పింక్‌-బాల్‌ టెస్టు కేవలం రెండు రోజులలోనే ముగియడంతో అక్కడి పిచ్ పై ఇంగ్లాండ్ ఆటగాళ్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా మొతేరా పిచ్ పై స్పందించిన ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్.. పిచ్ పై వస్తున్న విమర్శలు తనకు అర్థం కావడంలేదని, నయాంద్ర మోడీ స్టేడియంలో  స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించాడని తాను ఎంజాయ్ చేశానని చెప్పాడు. అలాగే పిచ్ పై విమర్శలు చేసే వారిని విమర్శించాడు లైయన్. పిచ్ స్పిన్నర్లకు సహాయం అందించినప్పుడు మాత్రమే అందరూ విమర్శలు గుప్పిస్తారు. కానీ చాలా దేశాల్లో పిచ్ లు సీమింగ్ కు అనుకూలించినప్పుడు ఎవరూ ఏమీ అనరు.. ఎందుకు అని ప్రశ్నించాడు. అయితే ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు వికెట్లు తీయడం అద్భుతమని.. ముఖ్యంగా రూట్ 5 వికెట్లు సాధించడం గొప్ప విషయమని తెలిపాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల 4న అదే స్టేడియంలో జరగనుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.