నర్తనశాల నుంచి శ్రీహరి లుక్ విడుదల..

నర్తనశాల  నుంచి శ్రీహరి లుక్ విడుదల..

నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమాను పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిమిషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు ప్రకటించారు. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.  

ఈ లుక్ లో బాలయ్య ఆశ్చర్య పరిచారు.అర్జునిడిగా బాలయ్య మొఖం లో ఆ తేజస్సు ఆకట్టుకుంటుంది. ఇవాళ మరో లుక్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో భీముడి పాత్ర ధరి శ్రీహరి లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ విడుదల సందర్బంగా శ్రీహరి తనయుడు మేఘాంశ్ స్పందించాడు. ఈ సందర్బంగా చాలా ఏళ్ళ తర్వాత తన తండ్రి నటించిన సినిమాను చూడబోతున్నందుకు బాలయ్యతో పాటు శ్రేయాస్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.