నరేంద్ర మోడీ స్టేడియం పై విమర్శలు...

నరేంద్ర మోడీ స్టేడియం పై విమర్శలు...

మొతేరా స్టేడియం పేరు పై రాజకీయ దుమారం రేగింది. మొతేరాలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంగా ఉన్న పేరును ప్రధాని నరేంద్ర మోడీ పేరున మార్పు చేయడం.. దాన్ని గోప్యంగా ఉంచడం విమర్శలకు కారణమైంది. స్టేడియాన్ని మోడీ కలల ప్రాజెక్టుగా అభివర్ణించిన హోం మంత్రి అమిత్‌ షా.. అందుకే ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. అయితే, స్టేడియం పేరును నరేంద్ర మోడీ పేరిట మారుస్తున్నట్లు ప్రకటించగానే సోషల్‌ మీడియాలో విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ నాయకులతోపాటు ఇతర విపక్షాల నేతలు కూడా స్టేడియం పేరు మార్పును తప్పుబట్టారు. అలా చేయడం వల్లభాయ్‌ పటేల్‌ను అవమానించడమేనని దుయ్యబట్టాయి. దీంతో కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ వివరణ ఇచ్చారు. క్రికెట్‌ స్టేడియం పేరును మాత్రమే నరేంద్ర మోడీ పేరిట మార్చామన్నారు. కాంప్లెక్స్‌ పేరు వల్లభాయ్‌ పటేల్‌ పేరిటే కొనసాగుతుందని స్పష్టం చేశారు.