బాలయ్య మూవీలో నారా హీరో..!

బాలయ్య మూవీలో నారా హీరో..!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తెలుగు అమ్మాయి అంజలి ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి . ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ అంటూ పుకార్లు షికారు చేసాయి. ఇప్పటికే ఈ చిత్రంలో సాయేషా, పూర్ణలు నటిస్తున్నారు. అయితే... ఈ సినిమా నుంచి మరో వార్త వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ బిబి3 మూవీలో నారా రోహిత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్త హల్ చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న యంగ్‌ పాత్ర కోసం పలుగురిని పరిశీలిస్తుండగా.. నారా రోహిత్‌ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. బిబి3పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.