ఎన్టీవీ @ 13 ఇయర్స్.. నారా లోకేష్ శుభాకాంక్షలు

ఎన్టీవీ @ 13 ఇయర్స్.. నారా లోకేష్ శుభాకాంక్షలు

తొలి అడుగు నుంచి ట్రెండ్‌తో పాటు.. ట్రెడిషన్ కి కూడా సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు  అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. ఇక ఈ రోజు ఎన్టీవీ, భక్తి టీవీలు పదమూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

పాత్రికేయరంగంలో ఠీవిగా 13 వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఎన్టీవీ తెలుగుకి శుభాకాంక్షలు. పాత్రికేయ విలువలను కాపాడుతూ ఎన్టీవీని ప్రజలంతా నాటీవీ అనుకునే విధంగా తీర్చిదిద్దిన అధినేత నరేంద్ర చౌదరి గారికి, పాత్రికేయులు, సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు, కేవలం వార్తలే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలు,దైవం పట్ల విశ్వాసం పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని భాగస్వామ్యం చెయ్యడం ద్వారా ప్రజల మనస్సులో ఎన్టీవీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంటూ ఆయన పేర్కొన్నారు.