స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ స్టూడెంట్.. లాంగ్వేజ్ ఇలా మారింది ఏంటి?

స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ స్టూడెంట్.. లాంగ్వేజ్ ఇలా మారింది ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు నేతలంతా బూతుపురాణం అందుకుంటున్నారు.. సమస్య ఏదైనా? ఆరోపణలు ఏవైనా..? విమర్శించడం ఏ తరహాలోనైనా..? దాంట్లో నేతలు బూతులు జోడిస్తున్నారు... దానికి అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేదు.. ఇక, ఉన్నత చదువులు చదివినవారు సైతం.. మాట్లాడేస్తున్నారు.. ఓ పక్షం నుంచి విమర్శలు వస్తే.. ఆదేస్థాయిలో మరో పక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా, చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్.. దీని వరుస ట్వట్ చేసిన లోకేష్... "మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది?'' అని ప్రశ్నించారు.

వరుస ట్వీట్లు చేసిన లోకేష్.. మరో ట్వీట్‌లో "గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది ?" అంటూ ప్రశ్నించారు.. "ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో ? ఇక్కడే అర్ధం అవుతుంది, ''యువమేత'' ఆత్రం. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే.." అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక, ఈ ట్వీట్లకు పేపర్లలో వచ్చిన న్యూస్‌.. సిట్‌కు సంబంధించిన జీవోను జత చేశారు. గతంలోనూ నారా లోకేష్ ట్వీట్లు చేసినా.. ఇప్పుడు మాత్రం క్రమంగా ఆయన ట్వీట్లలో ఘాటు వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. ఇక, లోకేష్ తన ట్వీట్లకు #YSPappuBatch అనే హాష్ ట్యాగ్ తగిలించారు.