బ్లాగు రచనలో అడుగుపెట్టిన లోకేష్..దళితులపై మొదటి వ్యాసం.!

బ్లాగు రచనలో అడుగుపెట్టిన లోకేష్..దళితులపై మొదటి వ్యాసం.!

టీడీపీ నేత నారాలోకేష్ బ్లాగు రచనలో అడుగుపెట్టారు. ఈ  విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.  "ఇప్పుడు నేను 'మీడియం' అనే వేదికపై ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా. నా తొలి వ్యాసం కూడా రాసేశాను. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులపై నా వ్యాసం రాశాను" అంటూ ఆయన ట్వీట్ చేసారు.  దళితుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? అనే టైటిల్ తో ఆయన మొదటి బ్లాగును రాసారు. వ్యాసంలో ఇటీవల ఘటనలతో పాటు గతంలో ఎలా ఉండేదన్న విషయాన్ని పంచుకున్నారు. ఇక ఇప్పటికే ఆయన బ్లాగుకు కామెంట్లు, లైకులు వస్తున్నాయి. మరిన్ని వ్యాసాలు రాయాలంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.