రాయలసీమ ముద్దుబిడ్డ ఏడీ?
ఈరోజు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఈరోజు అనంతపురం జిలాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం మిడుతూరులో లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ బిడ్డ అని పాట రాయించుకున్న జగన్ రెడ్డి రాయలసీమ గడ్డ తీవ్రంగా నష్టపోతే ఎక్కడున్నాడు ? అని ప్రశ్నించారు. రాయల సీమ పై ఎన్నికలకు ముందు ప్రేమ కురిపించిన జగన్ రెడ్డి కి ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడకి పోయింది? అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖా మంత్రి పంట నష్టాలను పరిశీలించేందుకు మొఖం చెల్లదా? అని ఆయన ప్రశ్నించారు.
అధికారులకూ వరద బాధితుల్ని పరామర్శించేందుకూ తీరిక లేదా? అని లోకేష్ ప్రశ్నించారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతుల్ని ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా పరామర్శిస్తే ఎదురుదాడి చేస్తారా? అని అయన ప్రశ్నించారు. వర్షాలతో వేరుశనగ రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్న అయన పంట నష్టం లెక్కించేశాం, 39 కోట్లిచ్చామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోందని అన్నారు. జగన్ సర్కారిచ్చిన 39 కోట్లు ఒక్క మండలంలో జరిగిన పంటనష్టానికి సరిపోదని ఆయన అన్నారు. ఒక్క వేరుశనగ పంట అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాలలో పూర్తిగా దెబ్బతిందని, ఎకరాకి 25 వేలు దాకా పంట పెట్టుబడులకు పెట్టిన రైతులు 2 వేల కోట్లకు పైగా నష్టపోయారని అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)