సీఎం జగన్ పిరికివాడు.. ఓట్లు అడగాలంటే వైసీపీకి భయం : లోకేష్‌

సీఎం జగన్ పిరికివాడు.. ఓట్లు అడగాలంటే వైసీపీకి భయం : లోకేష్‌

ఏపీ సీఎం జగన్‌, వైసీపీపై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ఒక పిరికివాడని.. పీక మీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయమని పేర్కొన్నారు.  "వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టిడిపి అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు. పలాస,రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టిడిపి అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు.నువ్వొక నాయకుడివి.నీదొక పార్టీ.అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్‌." అంటూ నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు.