అసెంబ్లీ లాబీల్లో నారా లోకేష్..

అసెంబ్లీ లాబీల్లో నారా లోకేష్..

మాజీ మంత్రి నారా లోకేష్.. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లాబీల్లో ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు లోకేష్... అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఆనం రాంనారాయణరెడ్డిలకు కంగ్రాట్స్ చెప్పారు లోకేష్... బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును నమస్తే అంటూ పలకరించాడు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నారా లోకేష్... మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్.. అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి.