తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం..లోకేష్ సీరియస్..!

తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం..లోకేష్ సీరియస్..!

గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసం చేసినంత మాత్రాన ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదని, ప్రజల హృదయాల్లో కొలువైన దైవం అని పేర్కొన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. "కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చెయ్యడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చెయ్యగలమని సైకో మనస్తత్వంతో వైఎస్ జగన్ గారు, వైకాపా నాయకులు అనుకుంటున్నారు. అది మీ తరం కాదు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి " అంటూ లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ట్వీట్ ను లోకేష్ ముఖ్యమంత్రి జగన్ కు టాగ్  చేసారు.