జగన్ ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్నాడు : లోకేష్

జగన్ ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్నాడు : లోకేష్

ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ అలాగే వైసీపీ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. రాష్ట్ర  వ్యాప్తంగా కురుస్తున్న వరదలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోవాల్సింది పోయి ఎం కావాలి రా మీకు? మమ్మల్నే ప్రశ్నిస్తారా?పోండి అవతలకి అంటూ ఛీత్కరించుకొని వెళ్లిపోయారు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు అంటూ తెలిపారు. గుంటూరు జిల్లా,వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పర్యటించిన వైకాపా ప్రజాప్రతినిధుల బృందానికి ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణం.ఆదుకోమని అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజల పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు అని అన్నారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారు. ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా సీఎం జగన్ రెడ్డి ఇప్పుడైనా మేల్కోవాలి అని పేర్కొన్నారు.