ఒక్క అద్దం కూడా పగలకొట్టలేదన్న లోకేష్...అరెస్ట్ !

ఒక్క అద్దం కూడా పగలకొట్టలేదన్న లోకేష్...అరెస్ట్ !

అమరావతి కోసం చేపట్టిన గద్దె రామ్మోహన్‌ దీక్ష ముగిసింది. ఆయనకు  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు నారా లోకేష్‌. ఈ సందర్భంగా లోకేష్‌ జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. 21 రోజుల నుంచి రైతుల శాంతియుతంగా దీక్ష చేస్తుంటే.. పోలీసుల అడ్డుకోవడం అన్యాయమన్నారు లోకేష్‌. ఈ దీక్షల్లో ఏ రోజైనా ఒక కారు అద్దమైనా పగిలిందా అని పోలీసులను ప్రశ్నించారు లోకేష్‌. వైజాగ్‌లో రాజధాని పెట్టడం అక్కడి ప్రజలకు ఇష్టం లేదన్నారు లోకేష్‌. కర్నూలు హైకోర్టు పెట్టడం వల్ల ఏ అభివృద్ధి జరగదన్నారాయన. ఇక  జాతీయ రహదానికి దిగ్భందనానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో లోకేష్ చినకాకానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే లోకేష్‌ని అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్‌ సమీపంలో టీడీపీ నేత నారా లోకేష్, ఎమ్మెల్యే  రామానాయుడులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను యనమల కుదురు పీఎస్‌కి తరలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.