అభిమానులకు నానీ మరో ట్రీట్

అభిమానులకు నానీ మరో ట్రీట్

నానీ తనదైన నటనతో నాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలా మొదలైందీతో మొదలు పెట్టి తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కరోనా లాక్‌డౌన్‌లోనూ ‘వీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ అనే సనిమా చేస్తూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యోచేవారు ఎవరురా ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అందులో నాని పంచకట్టుకుని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో ఓ బ్రహ్మణ కుర్రడి పాత్రలో నాని కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో నానీ తన ఇంటిని కిరాయికి ఇచ్చేందుకు చూస్తాడు. అందులోకి హీరోయిన్ నజ్రియా, ఆమె కుటుంభ సభ్యులు బ్రాహ్మణులుగా నటిస్తూ ఇంట్లో చేరుతారని, ఆ తరువాత వీరిద్దరి మధ్య జరగే కథ అందరిని కడుపుబ్బా నవ్విస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ కుటుంభ సభ్యులు, నానీ మధ్య ఉండే కామెడీని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఎటువంటి పాత్రకైనా న్యాయం చేసే నాని కామెడీ యాంగిల్ అంటే రెచ్చిపోతాడు. భలేభలే మగాడివోయ్ సినిమా హిట్ అవ్వడానికి నానీ టైమింగే కారణం అని చెప్పొచ్చు. మరి ఈ సారి మెప్పిస్తాడా లేదా అనేది చూడిలి.