నాని 28వ మూవీకి ఆసక్తికర టైటిల్‌..!

నాని 28వ మూవీకి ఆసక్తికర టైటిల్‌..!

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకుంటున్నాడు. అయితే నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో రిలీజ్‌ అయింది. ఆ సినిమా తర్వాత నిన్ను కోరి సినిమా తో హిట్ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే నాని తరువాత సినిమా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాను ప్రకటించేశాడు నాని. "అంటే సుందరానికి"  అనే టైటిల్‌ తో నాని మరో సినిమాను అనౌన్స్‌ చేసేశాడు. ఈ సినిమా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. నవీన్‌ ఏర్నేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తీసుకొస్తోంది. ఈ సినిమాలో నజరియా హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభకానుంది.