కళ్యాణ్ రామ్ కల నెరవేరిందిలా..!

కళ్యాణ్ రామ్ కల నెరవేరిందిలా..!
నందమూరి కళ్యాణ్ రామ్ మంచి స్పీడ్ లో ఉన్నాడు.  కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్ఎల్ఏ సినిమా హిట్ అయింది.  ఈ సినిమా హిట్ తరువాత కళ్యాణ్ రామ్ బయటి బ్యానర్లో నా నువ్వే సినిమా చేస్తున్నాడు.  జయేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటిస్తోంది.  ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి.  
పాటలు హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  అంతేకాదు శాటిలైట్ హక్కులు కూడా భారీ స్థాయిలో జరగడంతో కళ్యాణ్ కళ్యాణ్ రామ్ కు డిమాండ్ పెరిగింది. నా నువ్వే సినిమాను డిఫరెంట్ లైటింగ్ సెటప్ లో షూట్ చేశారట.  పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  దేశంలో గొప్ప సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు పీసీ శ్రీరామ్. గీతాంజలి, ఘర్షణ చిత్రాలే అందుకు ఉదాహరణలు.  పీసీ శ్రీరామ్ తో కనీసం ఒక సినిమా అయిన చేయాలన్నది కళ్యాణ్ రామ్ కల అట. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరిందని కళ్యాణ్ రామ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.