రేపు బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్...

రేపు బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్...

నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమాను పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిముషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసారు. రేపు 12.30 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.