ఎన్టీఆర్ ని మించిన నెంబర్ వన్ హీరో ఎవడు లేడు

ఎన్టీఆర్ ని మించిన నెంబర్ వన్ హీరో ఎవడు లేడు

స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి బాలకృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జాతి గర్వించదగ్గ నాయకుడన్నారు. అత్యున్నత వ్యక్తిత్వం, అదే స్థాయిలో నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఎన్టీ రామారావు చిరునామాగా నిలిచారని, దేశ చరిత్రలో చిరస్మరణీయుడని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లి నటుడిగా నిరూపించుకుని, అద్బుతమైన సినిమాలు, పాత్రలు చేసి అలరించారు. ఎన్టీఆర్ ని మించిన నెంబర్ వన్ హీరో ఎవడు లేడని బాలకృష్ణ అన్నారు.