నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టికెట్ చిన్నపరెడ్డిదేనా...

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టికెట్ చిన్నపరెడ్డిదేనా...

తెలంగాణలో మరో ఎలక్షన్‌ ఆసక్తికరంగా సాగనుంది.అధికార టియ్యారెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఎవర్ని నిలబెడతారనేది ఇంకా తేలలేదు. టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నప్ప రెడ్డికి అవకాశం రాకుండా ప్రత్యర్ధులు ఎత్తులు వేస్తున్నారా?  చిన్నప్ప రెడ్డి టికెట్ దక్కించుకోగలరా?

నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కు ఈ నెలలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల సమావేశంలో కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థిగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న  తెరా చిన్నప్పరెడ్డి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ  అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సన్నిహితుల వద్ద చిన్నప్పరెడ్డి ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో చిన్నప్ప రెడ్డి బిజెపితో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ను తీవ్రంగా ఖండించారు తెర చిన్నప్ప రెడ్డి

నాగార్జున సాగర్ లో చిన్నప్ప రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నప్పటికీ జిల్లాలో కొందరు ఆయనను కొందరు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.  చిన్నప్ప రెడ్డికి మద్దతు ఇచ్చే నేతలను వారి వైఖరిని మార్చుకోవాలని సూచిస్తున్నారట. ఒక వైపు చిన్నప్ప రెడ్డి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఆ ప్రయత్నాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఆయన ప్రత్యర్ధులు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బై ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటున్న చిన్నప్ప రెడ్డి ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ను టిఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుంది. మరి బై ఎలక్షన్ అభ్యర్థిగా ఎవరికి ఛాన్స్ వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.