టాలీవుడ్ కింగ్ నాగార్జున.. అరవై దాటినా మన్మధుడే !

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. అరవై దాటినా మన్మధుడే !

తెలుగులో విక్రమ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వరుస సినిమాలతో టాలీవుడ్ కింగ్ గా మారాడు. అక్కినేని అభిమాన సామ్రాజ్యాన్ని తండ్రి నుండి అందుకున్న ఈయన ఇప్పటికీ ఎక్కడా తొట్రు పడకుండా రూల్ చేస్తున్నాడు. అక్కినేని నాగేశ్వర్రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇక ఏఎన్నార్ వారసుడు వస్తున్నాడనగానే అక్కినేని అభిమానులు ఒక రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ నాగ్ డెబ్యూ మూవీ ‘విక్రమ్’ ఆ అంచనాలని అందుకోలేకపోయింది. 

పైగా నాగ్ యాక్టింగ్ పైనా నెగటివ్ టాక్ వచ్చింది. అయితే నాగార్జున హీరోగా లాంచ్ అయి మూడేళ్లైనా సరైన బ్లాక్ బస్టర్ లేదే అని అక్కినేని అభిమానులంతా ఫీలవుతోన్న టైమ్ లో ‘శివ’ సినిమాతో సంచలనం స్రుష్టించాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీతో యూత్ ఫాలోయింగ్ పెచుకున్నాడు. ఇక ‘శివ’కంటే ముందే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘గీతాంజలి’తో వెండితెరని కూడా ప్రేమలో పడేశాడు. నైంటీస్ కి చాలా ఫార్వర్డ్ థాట్స్ తో  వచ్చిన ఈ సినిమాలు నాగార్జునని ట్రెండ్ సెట్టర్ గా నిలబెట్టాయి.

విక్రమ్ సినిమాతో తెలుగు సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాగార్జున శివ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.  మజ్ను, మణిరత్నం గీతాంజలి సినిమాలు నాగార్జున కెరీర్ ను ఓ మలుపు తిప్పిన సినిమాలుగా చెప్పొచ్చు.  హలో బ్రదర్ సినిమా ద్వారా మాస్ హీరోగా గుర్తింపు పొందారు.  ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నారు.  నిన్నేపెళ్లాడుతా, మన్మధుడు సినిమాలతో అమ్మాయిల మనసును దోచుకున్నాడు.  

కింగ్ సినిమా నాగార్జున కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా.  సాంఘిక సినిమాలే కాకుండా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి రస చిత్రాల్లో నటించి తనలో ఓ భక్తుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు నాగార్జున.  ఇటీవలే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎలాంటి హిట్టయిందో చెప్పక్కర్లేదు.  నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించాడు.  

నిజానికి నాగార్జున ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో అన్నీ ఒకే రకమైన సినిమాలు చెయ్యలేదు. గ్రీకువీరుడిగా అమ్మాయిల్లో బోల్డంత లేడీ ఫాలోయింగ్ ఉన్న టైమ్ లోనే భక్తి చిత్రంలో నటించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అన్నమయ్య’లా మారిపోయి, టాలీవుడ్ కి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ కూడా మారిపోయింది. టాలీవుడ్ కింగ్ గా టాప్-4లో ఉన్నప్పుడు కూడా కొత్త దర్శకులతో కలిసి సినిమాలు చేశాడు.

అయితే ఈ కాంబినేషన్స్ కొన్నిసార్లు ఫెయిల్ అయినా నాగ్ మాత్రం ఇప్పటికీ కొత్త వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ మొదలు కళ్యాణ్ క్రిష్ణ దాకా చాలా మంది దర్శకులని ఇంట్రడ్యూస్ చేశాడు నాగార్జున.అంత ఎందుకు ఇప్పుడు నాగ్ నటిస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమా డైరెక్టర్ సాల్మాన్ కి కూడా ఇదే మొదటి సినిమా.  సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా చాలామంది న్యూ కమర్స్ ని ఎంకరేజ్ చేశాడు. ఈ ఏడాది అయినా ఆయనకు ఒక మంచి హిట్ సినిమా పడాలని కోరుకుందాం.