"బిగ్ బాస్ 4" నుండి బిగ్ అప్డేట్..!

 "బిగ్ బాస్ 4" నుండి బిగ్ అప్డేట్..!

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సీజన్ వన్ నుండి ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ఇక ఇప్పటివరకు మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అయితే నాలుగవ సీజన్ ను కూడా ప్రారంభించేందుకు షో నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అయితే నాలుగవ సీజన్ లో వ్యాఖ్యాతగా ఎవరు ఉంటారు. కంటెస్టెంట్ లు ఎవరు అన్నది ప్రేక్షకుల్లో ప్రశ్నగా మిగిలిపోయింది. కాగా ఆ కార్యక్రమానికి హోస్ట్ ఎవరన్నదానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మూడో సీజన్​ వ్యాఖ్యాతగా అద‌ర‌గొట్టిన‌ హీరో నాగార్జున యే ఈ సీజన్​కు కూడా హోస్ట్​గా సంద‌డి చేయ‌నున్నారు. ఇక తాజాగా షోకు సంబందించిన యాడ్ చిత్రీకరణను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రించారు. దీనికి "సోగ్గాడే చిన్నినాయిన'' సినిమా డైరెక్టర్  కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ను సైతం ఎంపిక చేసారు. ఎంపిక చేసిన వారిని ముందుగా 14రోజులు క్వారంటైన్ లో ఉంచి ఆ తరవాత "షో" కి పంపనున్నారు.