నగరి నియోజకవర్గంలో వైసీపీ గ్రూప్ వార్.. రోజా లేకుండానే...!

 నగరి నియోజకవర్గంలో వైసీపీ గ్రూప్ వార్.. రోజా లేకుండానే...!

నగరి నియోజకవర్గంలో మరోసారి వర్గపోరు రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. అది కూడా ఏకంగా డిప్యూటీ సీఎం నిర్వహించడం ఇప్పుడు నియోజకవర్గంలో వివాదానికి కారణమైంది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలిసి నగరి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశం పై ఎమ్మెల్యే రోజాకి కానీ అనుచరులకు కానీ ఎలాంటి సమాచారం లేదు.

పుత్తూరులోని ఓ కల్యాణమండపం నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షకు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కూడా హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజాకు ఈ సమీక్ష సమావేశం పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై రోజా అనుచరులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రోజా వైరీ వర్గానికి చెందిన వైసీపీకే చెందిన కేజే కుమార్ ఆయన అనుచరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ వ్యవహారం పై రోజా మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.