కీసర నాగరాజుది ముమ్మాటికీ హత్యే : భార్య స్వప్న

కీసర నాగరాజుది ముమ్మాటికీ హత్యే : భార్య స్వప్న

 కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజుది ఖచ్చితంగా హత్యేనని ఆయన భార్య స్వప్న పేర్కొన్నారు. నా భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని ఎన్టీవీతో నాగరాజు భార్య స్వప్న అన్నారు. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. చంచల్ గూడ జైల్ లో ఏదో జరిగింది! అని ఆమె అన్నారు. జైల్ లో ఖైదీగా ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క జైల్ అధికారి పై చర్యలు ఎందుకు  తీసుకోలేదు ? అని ప్రశ్నించారు. నాగరాజు అరెస్ట్ అయ్యాక నేను బెంగళూర్ వెళ్లిన మాట వాస్తవమే కానీ నాకు నాగరాజుకు మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం మాత్రం నిజం కాదని అన్నారు. తనకు నాగరాజు అంటే ఎంతో ఇష్టమన్న ఆమె చనిపోయిన రోజు ఉదయం కూడా అయన మా బంధువులతో వీడియో కాల్ లో మాట్లాడాడని అన్నారు. రెండో కేసు పూర్తిగా తప్పుడు కేసు అని నాగరాజు మా బంధువులతో అన్నాడని, చంచల్ గూడ జైల్ లో జరిగిన నా భర్త మరణం పై సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు. నా భర్త నాగరాజు ది ముమ్మాటికీ హత్యేనని ఆమె అంటున్నారు. ఈ విషయం మీద కోర్టుకు కూడా వెళ్తామని ఆమె అన్నారు.