'లవ్ స్టోరీస్' నే నమ్ముకున్న అక్కినేని వారసుడు..!

'లవ్ స్టోరీస్' నే నమ్ముకున్న అక్కినేని వారసుడు..!

అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య సినిమాలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి అన్ని రకాల జోనర్  లను టచ్ చేస్తూ వస్తున్నాడు. యాక్షన్, ఫ్యామిలీ ఇలా ఎన్నో సినిమాలు చేసిన మనోడికి కలిసి రావడంలేదు. ఇక ఎన్నో ఫ్లాపుల తర్వాత  'మజిలీ' లాంటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. అందమైన ప్రేమ కథగా  తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు. 

ప్రస్తుతం ఈ యంగ్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'లవ్ స్టోరీ' అనే అటైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్కు తగ్గటుగానే ఈ సినిమా బ్యూటీఫుల్ లవ్ స్టోరీ తో తెరకెక్కుతుంది. 'ఫిదా' లాంటి సూపర్ హిట్ సినిమాతర్వాత వస్తున్న మరో లవ్ స్టోరీ కాబట్టి సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ తరువాత 'గీత గోవిందం' సినిమాతో విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకె చేసాడు చైతన్య. ఈ సినిమా కూడా లవ్ స్టోరీ గానే తెరకెక్కుతుంది. ఇలా వరుసగా లవ్ స్టోరీస్ పైనే నాగచైతన్య దృష్టి పెట్టాడు.మరి ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.