వెంకీకుడుముల, వైష్ణవ్ తేజ్ తో మైత్రీ సినిమా

వెంకీకుడుముల, వైష్ణవ్ తేజ్ తో మైత్రీ సినిమా

తొలి సినిమా 'ఉప్పెన'తో అనూహ్యమైన హిట్ కొట్టాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే క్రిష్‌ తో 'కొండపొలం' షూటింగ్ చేసిన వైష్ణవ్... 'ఉప్పెన' తర్వాత వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఇతగాడి ఖాతాలు ఆరు సినిమాల వరకూ ఉన్నాయి. 'కొండపొలం' విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక తమిళ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమా చేయానికి ఓకె చెప్పాడు. ఇవి కాకుండా తనకు హీరోగా లైఫ్‌ ఇచ్చిన మైత్రీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాల డీల్ కి కూడా ఓకె చెప్పినట్లు సమాచారం. మైత్రీ వారు దర్శకుడు వెంకీ కుడుములకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. మహేశ్ బాబుతో సినిమా చేయాలన్నది వెంకీ ప్లాన్. అయితే ఇంకా స్క్రిప్ట్ ఓకె కాలేదు. దీంతో ముందుగా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు వెంకీ కుడుముల. ఈ చిత్రానికి కూడా సుకుమార్ సమర్పకుడుగా వ్యవహరిస్తాడట. సో వీలయినంత త్వరలో వెంకీకుడుముల, వైష్ణవ్ తేజ్ తో మైత్రీవారి సినిమా అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ...