పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు తరహా వ్యాధి... ఆందోళనలో ప్రజలు
ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనేక మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనేక మంది ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నీటిలో రసాయనాలు కలవడమే ఇందుకు కారణమని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి సంఘటనే అదే జిల్లాలో మరొకటి జరిగింది. దెందులూరు మండలంలోని కొమిరేపల్లి గ్రామంలో ప్రజలు కళ్ళుతిరిగి పడిపోతున్నారు. గ్రామంలోని అనేకమంది ఇదే తరహాగా పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతుచిక్కని వ్యాధిగా స్థానికులు అనుమానిస్తున్నారు. వింత వ్యాధికి గురైన వ్యక్తులను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)