వింత జంతువు దాడి.. తూ గో జిల్లాలో కలకలం !

వింత జంతువు దాడి.. తూ గో జిల్లాలో కలకలం !

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని జంతువు దాడులు చేయడం కలకలం రేపుతోంది. రాత్రి సమయాల్లో పశువుల పై దాడులు చేస్తోంది ఆ జంతువు. తాజాగా, నవాబుపేటలో ఓ దూడను చంపింది. కొన్ని నెలల క్రితం కూడా ఆలమూరులో పశువులపై గుర్తు తెలియని జంతువుల దాడులు భయాందోళనలకు దారితీశాయి. అయితే... గ్రామస్తులు కాపు కాసి.. ఓ తోడేలును పట్టుకున్నారు. దీంతో కొంత కాలంగా పశువుల పై దాడులు ఆగాయి. అయితే, తాజాగా మళ్లీ పశువుల పై దాడులు చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.