ఉద్యోగులకు బంపర్ అఫర్ - టిక్కెట్లతో పాటు సెలవు కూడా...
రజినీకాంత్ దర్బార్ సినిమా ఈనెల 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో పెద్ద పండగ అనే చెప్పాలి. పొంగల్ ముందుగానే వచ్చినట్టు. రజినీకాంత్ సినిమా రిలీజ్ రోజున కొన్ని కంపెనీలు సెలవులు ఇస్తుంటాయి. సెలవులు ఇవ్వడమే కాకుండా టికెట్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు తమిళనాడుకు చెందిన మై మనీ మంత్ర అనే సంస్థ రజినీకాంత్ దర్బార్ సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్స్ కొనుగోలు చేసింది.
సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా టికెట్స్ కొనుగోలు చేసి వాటిని ఉద్యోగులకు ఇచ్చింది. అంతేకాదు, ఆరోజున పెయిడ్ లీవ్ ను ప్రకటించింది. పొంగల్ రోజున పొంగల్ బోనస్ ను ఇవ్వబోతున్నట్టు కూడా ప్రకటించింది మై మనీ మంత్ర. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)