ఇంటినుంచే పనిచేస్తున్నారా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి... 

ఇంటినుంచే పనిచేస్తున్నారా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి... 

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే సౌకర్యాన్ని కల్పించారు.  దీంతో ఇంట్లో నుంచే చాలా మంది పనులు చేస్తున్నారు.  ఇంట్లో సౌకర్యంగా ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే, ఇంటి నుంచి పనిచేసి ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  

ఇంటి నుంచి ఆఫీస్ పని చేసే సమయంలో ల్యాప్ టాప్ లను ఒళ్ళోనో లేదంటే కింద పెట్టుకోనో పని చేస్తుంటారు.  ముందు వంగిపోయి పనిచేస్తుంటారు.  ఇలా ముందుకు వంగి కూర్చొని పనిచేయడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి.  నడుముపై భారం పడుతుంది.  మెడనొప్పి, వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  కింద కూర్చొని పనిచేయాలి అనుకున్నప్పుడు కూర్చొని, లాప్ టాప్ ను కింద పెట్టకుండా చిన్నటేబుల్ మీద పెట్టుకోవాలి.  స్క్రీన్ ఎత్తుగా ఉండకుండా కళ్ళకు సమాంతరంగా లేదంటే కొద్దిగా కిందకు ఉండేలా పెట్టుకోవాలి.  పనిచేసే సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి లేచి కొద్దిగా నడవాలి.  ఇలా చేయడం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి.