మటన్ కూరలో సైనేడ్... కోడి చచ్చింది... కానీ...!!

మటన్ కూరలో సైనేడ్... కోడి చచ్చింది... కానీ...!!

అక్రమ సంబంధాలు మనిషిని ఎలా మార్చేస్తాయి చెప్పక్కర్లేదు.  ప్రతి మనిషిని ఇబ్బందులు పెడుతుంటాయి.  ఎవరితో అయినా నవ్వుతు మాట్లాడినా ఇప్పుడున్న రోజుల్లో తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.  తప్పుడు అర్ధాలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు.  భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం అన్యోన్యతతో కూడుకొని ఉండాలి అంతేగాని, అనుమానాలతో ఉండకూడదు.  అలా ఉంటె ఎప్పటికైనా సరే చాలా డేంజర్ అని చెప్పాలి.  

భీమడోలు మండలంలోని పోలసాలిపల్లి గ్రామమానికి చెందిన గురునాథ్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేసుకుంటున్నాడు.  అతని భార్య కిల్లి కొట్టు నడుపుతున్నది.  అయితే, భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అనుమానంతో రోజు భర్తతో గొడవలు పెట్టుకునేది. ఈ గొడవలు పెద్దవి కావడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుంది.  మాములుగా చంపితే అందరికి తెలిసిపోతుందని చేపి సైనేడ్ తో చంపాలని అనుకుంది.  ఎలాగోలా కష్టపడి సైనేడ్ సంపాదించింది.  మొదట సైనేడ్ ను కోడిపై ప్రయోగించింది.  కోడి చనిపోవడమే కాకుండా రంగు మారయింది.  అప్పటికే భర్తకు అనుమానం వచ్చింది.  ఆ తరువాత మటన్ కర్రీలో సైనేడ్ ను కలిపి భర్తకు పెట్టింది.  అనుమానంతో ఒక ముక్క తిన్న భర్తకు టేస్ట్ వేరుగా ఉండటంతో సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు.  మటన్ కర్రీని పరిశీలించిన పోలీసులు సైనేడ్ కలిపారని తేల్చారు.  భర్తను చంపాలి అనుకున్న భార్యను, కొడుకును మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ వార్త గోదావరి జిల్లాల్లో వైరల్ గా మారింది.