క్వారంటైన్ కేంద్రం నుంచి మర్డర్ కేసు నిందితుడి పరార్

క్వారంటైన్ కేంద్రం నుంచి మర్డర్ కేసు నిందితుడి పరార్

క్వారాంటైన్ కేంద్రం నుండి మర్డర్ కేసులో ముద్దాయి తప్పించుకు పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నూడుల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం  గన్నవరం సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్నాడు. అయితే అతనికి కరోనా పాజిటివ్ రావటంతో, కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వరంటెన్ కేంద్రానికి అధికారులు నిన్న సాయంత్రం తరలించారు. అయితే నిన్న రాత్రి 10 గంటల సమయంలో తప్పించుకు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ముద్దాయిది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలోని లింగంపల్లి గ్రామమని చెబుతున్నారు. చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోవటంతో కేర్ అండ్ షేర్ స్వచ్చంధ సంస్థలో పెరిగినట్లు చెబుతున్నారు. ఇతను స్మశాన వాటికలో నిద్ర పోతాడని చెబుతున్నారు. కంకిపాడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.