చెన్నై చిత్తు చిత్తు...

చెన్నై చిత్తు చిత్తు...

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరో ఓటమిని చవిచూసింది. పది వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఇషాన్‌ కిషాన్‌ అర్థసెంచరీతో చెలరేగాడు. ఫోర్లు,సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. డికాక్‌ కూడా రాణించడంతో మరో 7.4 ఓవర్లు ఉండగానే గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేసింది. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్యామ్‌ కరన్‌ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డూప్లెసిస్‌, రాయుడు, ధోనీ, జడేజా.. ఎవ్వరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ఆల్‌రౌండర్‌ కరన్ .. ఒక్కడే పోరాడాడు. టెయిలెండర్లతో కలిసి ఒంటరిపోరాటం చేశాడు. కరన్‌ ఆ మాత్రం పోరాడకపోయి ఉంటే.. చెన్నై 50 పరుగులలోపే చాపచుట్టేసేదేమో.