వరద నీటిలో చిక్కుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు..

వరద నీటిలో చిక్కుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు..

మహారాష్ట్ర, ముంబై ప్రాంతాన్ని భారీ వర్షాలు వీడడం లేదు... థానే జిల్లాలో బద్లాపూర్, కల్యాణ్ ప్రాంతాలు జలమయం కాగా... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదనీటిలో ముంబై - కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్.. బద్‌లాపూర్‌-వాంగాని మధ్య చిక్కుకుపోయింది. ఈ రైలులో సుమారు 2వేల మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. 2 అడుగులు మేర వరద నీరు రైల్వే ట్రాక్‌పై నిలిచిపోవడంతో.. రైలు ఎటూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉదయం నుంచి ప్రయాణికులు రైలులోనే అల్లాడిపోతున్నారు. ప్రయాణీకుల్లో చిన్న పిల్లలు కూడా ఉండడంతో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైలులో ఉండడం ఆందోళన కలిగించే విషయం. దీంతో రైల్వే పోలీసులు, ముంబై పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోటు దారా ప్రయాణికులను తరలించే ప్రయత్నాలు జరుగుతుండగా.. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే, రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ధైర్యాన్ని చెబుతున్నారు అధికారులు... రైలు సురక్షితమైన ప్రాంతంలోని ఉంది.. ఆందోళన చెందొద్దని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఇక, ఆ ట్రైక్‌పై వెళ్లే రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు.