ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

ఈరోజు ఐపీఎల్ 2020 లో దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. అయితే గాయం కారణంగా గత మూడు మ్యాచ్ లకు దూరం అయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు కూడా దూరంగానే ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించగా.. ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, కగిసో రబాడా, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నార్ట్జే

ముంబై : క్వింటన్ డి కాక్ (w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, క్రునాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (c), జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా