ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై...

ఐపీఎల్ 2020 లో 10 వ మ్యాచ్ ఈ రోజు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆర్సీబీ జట్టులోకి కొత్తగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వచ్చాడు. అయితే ఐపీఎల్ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్ లలో ఎదురుపడగా ముంబై 16 సార్లు విజయం సాధిస్తే బెంగళూరు 9 మ్యాచ్ లలో గెలిచింది. మరి ఈ 26 వ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

బెంగళూరు జట్టు : దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), శివం దుబే, వాషింగ్టన్ సుందర్, గుర్కీరత్ సింగ్ మన్, ఇసురు ఉడనా, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా 

ముంబై జట్టు : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా