ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆడకపోవడంతో ముంబైకి న్యాయకత్వం వహిస్తున్న కీరన్ పొలార్డ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. కానీ ఇంతకముందు ఆ అవకాశం వచ్చిన ఢిల్లీ, బెంగుళూరు విఫలమయ్యాయి. ఇక ప్లే ఆఫ్ రేస్ లో లేని రాజస్థాన్ ను ఓడించి ముంబై ప్లే ఆఫ్ లో బెర్త్ ఖాయం చేసుకుంటుందా... లేదా రాయల్స్  నాలుగుసార్లు టైటిల్ అందుకున్న ఈ జట్టుకు షాక్ ఇస్తుందా అనేది చూడాలి.

రాజస్థాన్ : రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (w), జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (c), రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి

ముంబై : క్వింటన్ డి కాక్ (w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (c), క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా