ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బౌలింగ్ చేయనున్న పంజాబ్...

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బౌలింగ్ చేయనున్న పంజాబ్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచి ముంబై బ్యాటింగ్ ఎంచుకోవడంతో మొదట బౌలింగ్ చేయనుంది పంజాబ్. ఈ ఏడాది ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకపోతున్న ముంబైని పంజాబ్ ఆపగలదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇక ఈ మ్యాచ్ పంజాబ్ కు పెద్ద పరీక్షే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోతే తమ ప్లే ఆఫ్ ఆశలను దాదాపు వదులుకోవలసిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

పంజాబ్ : కెఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డికాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా