దూసుకుపోతున్న ముంబై... ఖాతాలో ఎనిమిదో విజయం... 

దూసుకుపోతున్న ముంబై... ఖాతాలో ఎనిమిదో విజయం... 

ఐపీఎల్ 13 వ సీజన్ లో ముంబై జట్టు దూసుకుపోతున్నది.  జట్టు ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శిస్తూ ఖాతాలో ఎనిమిదో విజయం నమోదు చేసుకుంది.  నిన్న అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  ఓపెనర్ దేవదత్ 74 పరుగులతో రాణించడంతో బెంగళూరు జట్టు ఈ స్కోర్ సాధించింది.  165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టులో సూర్యకుమార్ రెచ్చిపోయాడు.  కేవలం 43 బంతుల్లో 79 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయం అందించడంలో తనవంతు కృషి చేశాడు.  19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై జట్టు 166 పరుగు చేసింది.  ఈ విజయంతో ముంబై ఖాతాలో ఎనిమిదో విజయం నమోదుచేసుకోగా, బెంగళూరుకి ఇది వరసగా రెండో ఓటమి.  ముంబై 8 విజయాలతో మొదటిస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు జట్టు ఏడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.