ఐపీఎల్ 2020 : ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు...

ఐపీఎల్ 2020 : ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ ముందు బ్యాటింగ్ చేసింది. కానీ మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీని ముంబై కట్టడి చేసింది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన 25 పరుగులే ఆ జట్టు తరపున ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు. ఢిల్లీ బ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్ కు చేరుకుంటూ ఎవరు రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆ తర్వాత 111 పరుగుల లక్ష్యంతో బరిలో దిగ్గిన ముంబై మొదటినుండి విజయం వైపుకే పరుగులు తీసింది. కానీ ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డి కాక్ (26) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకున్న... ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(12*) తో కలిసి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(72*) అర్ధశతకం చేసి జట్టుకు 14.2 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. అయితే ఢిల్లీకి ఇది వరుసగా 4వ ఓటమి. ఈ జట్టుకు మిగిలిన చివరి మ్యాచ్ లో విజయం సాధించకపోతే ప్లే ఆఫ్స్ కు వెళ్లడం అనుమమే అని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ రన్ రేట్ చాలా తక్కువ గా ఉంది.