ఉత్కంఠ పోరులో ముంబై విజయం

ఉత్కంఠ పోరులో ముంబై విజయం

చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబై మూడు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది.187 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి183 పరుగులు చేసింది. పంజాబ్‌ ఓపెనర్లు తొలుత ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. ఓపెనర్ క్రిస్‌ గేల్‌(18: 11బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)త్వరగానే అవుట్ అయ్యాడు. దూకుడు మీదున్న మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్.. ఫించ్‌తో కలిసి దాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్‌ సైతం దాటిగా ఆడడంతో.. పంజాబ్‌ 12.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో బుమ్రా వేసిన 17 ఓవర్‌లో ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌(1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ దశలో రాహుల్(60 బంతుల్లో 94, 10 ఫోర్లు, 3సిక్స్‌లు)చెలరేగినా.. బుమ్రా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన క్రమంలో మెక్‌క్లీగన్ 13 పరుగులే ఇచ్చి ముంబైకి విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో ముంబై మూడు పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. బుమ్రా(3/15)కు మూడు వికెట్లు దక్కాయి. తొలుత టాస్ గెలిచిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనమిది వికెట్ల నష్టానికి186 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బుమ్రాకు దక్కింది.