కోల్‌కతాపై ముంబయి విజయం

కోల్‌కతాపై ముంబయి విజయం

ఐపీఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్‌కతాపై ముంబై అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై జయకేతనం ఎగురవేసింది. తొలుత టాస్ గెలిచిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లివీస్(43), సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సులు) బ్యాట్ జులిపించారు. చివరలో పాండ్యా (20 బంతుల్లో 35; 4 ఫోర్లు 1 సిక్సు ) చెలరేగడంతో ముంబై 181 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్రిస్ లిన్(17) మెక్ క్లాగాన్ కు దొరికిపోయాడు. మరో ఓపెనర్ గిల్(7) త్వరగానే అవుట్  అయ్యాడు. ఉతప్ప(54), రానా(31)ల జోడీ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ముంబై ఇండియన్స్ పటిష్టమైన బౌలింగ్ లో ఈ జోడి పెవిలియన్ బాట పట్టారు. చివరలో కార్తీక్(36) పోరాడినా.. నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్ హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసాడు.