ఫీల్డింగ్ తీసుకున్న ముంబై...

ఫీల్డింగ్ తీసుకున్న ముంబై...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2018లో నేడు 34వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై... రెండు మ్యాచ్‌లలో గెలిచి... ఆరు మ్యాచ్‌లలో ఓడి కేవలం నాలుగు పాయింట్లతో... పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితం కాగా... ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో గెలిచి... రెండు మ్యాచ్‌లు ఓడి 10 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉండగా... ఈ మ్యాచ్‌ గెలిచి తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. 

ఇక పంజాబ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు యువరాజ్ సింగ్... జట్టును పరిశీలిస్తే కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నైర్, మార్కస్ స్టొనిస్, అశ్విన్, అక్సర్ పటేల్, అండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్‌ పంజాబ్‌ జట్టులో ఉండగా... సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, ఇశాన్ కిషన్, జీన్-పాల్ డుమినీ, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాన్‌గాన్, మయాంక మార్ఖండే, బుమ్రా ముంబై జట్టులో ఉన్నారు.