అదరగొట్టిన ముంబై.. సూపర్ విక్టరీ
ముంబై ఆల్‌రౌండ్ షో ముందు పంజాబ్ నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఆరంభంలో స్లోగా ఆడిన ముంబై బ్యాట్స్‌మెన్ చివరి ఓవర్లలో చెలరేగిపోయారు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్లకు 87 పరుగులే చేయగలిగింది. ఈ సమయంలో రోహిత్ విజృంభించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 70 రన్స్ చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో పొలార్డ్, హార్దిక్ పాండ్య విరుచుకుపడ్డారు. పొలార్డ్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేయగా.. హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీళ్ల దూకుడు కారణంగా ముంబై 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.
ఇక, ఛేజింగ్‌లో పంజాబ్ ఓపెనర్లు శుభారంభమే అందించారు. రాహుల్, మయాంక్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే మయాంక్, రాహుల్, కరుణ్ నాయర్.. వెంటవెంటనే అవుటయ్యారు. ఈ దశలో నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ చేయాల్సిన రన్‌రేట్‌కు అతనొక్కడి ధనాధన్ ఏమాత్రం సరిపోలేదు. హిట్టర్ మ్యాక్స్‌వెల్ మరోసారి ఫెయిలవడంతో.. పంజాబ్‌కు బిగ్ షాక్ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో 70 రన్స్ చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని దాటిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి , సురేశ్ రైనా.. రోహిత్ కంటే ముందున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)