ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్ బలాలు... బలహీనతలు

ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్ బలాలు... బలహీనతలు

జట్టునిండా టాప్ ప్లేయర్స్, బెస్ట్ ఫినిషర్స్, జట్టును ఓటమి నుండి విజయం వైపుకు నడిపే ఆటగాళ్లు, కష్టకాలంలో అండగా నిలిచే ఆల్ రౌండర్స్ అలాగే అద్భుతమైన కెప్టెన్ తో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ప్రతి ఏడాది టైటిల్ ఫెవరెట్స్ గా బరిలో నిలిచే ఈ జట్టు ఈ ఏడాది కూడా అదే విధంగా బరిలోకి వస్తుంది. ఐపీఎల్ లో నాలుగుసార్లు టైటిల్ అందుకున్న ఘనత ముంబై జట్టుకే సొంతం. 2013 లో మొదటిసారి టైటిల్ అందుకున్న ఈ జట్టు వరుసగా రెండుసార్లు ఎప్పుడు గెలవలేదు. ఓ ఏడాది అదరగొడితే మరో ఏడాది చతికలపడి పోతుంది. అయితే గత ఏడాది టైటిల్ అందుకున్న ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఎలా ఆడుతుంది అనేది చూడాలి. 

బలాలు : ముంబై జట్టుకు అతిపెద్ద బలం కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ జట్టుకు రోహిత్ కెప్టెన్సీ, ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్, బెస్ట్ ఆల్ రౌండర్లు, ఫీల్డర్లు, బుమ్రా పేస్ బౌలింగ్ ఈ జట్టుకు ప్రధాన బలాలు. ఇక ఈ జట్టులో కీ ప్లేయర్స్ గా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నారు.

బలహీనతలు : ఈ జట్టుకు ఉన్న బలహీనతలలో స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేకపోవడం ఒకటి. అలాగే వ్యక్తిగత కారణాలు అంటూ పేసర్ లసిత్ మలింగ జట్టుకు దూరం కావడం మరో ప్రధానమైన బలహీనత.